

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా ప్రతిష్ట దెబ్బతింది. రాష్ట్రంలోనే అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు చేసిన జిల్లాగా నిలిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో 99.30 శాతంతో ములుగు జిల్లా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా మాత్రం 89.23 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉత్తీర్ణత 95.15 శాతంగా నమోదైంది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ నగరంలో కార్పొరేట్, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు నగరానికి వచ్చి చదవాలనే ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి.
ఉన్నత స్థాయి విద్య అందిస్తామని భారీ ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలలు కూడా 100 శాతం ఉత్తీర్ణత సాధించలేకపోయాయి. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ఉత్తీర్ణత శాతం 97.30 గా నమోదైంది.
మొత్తంగా జిల్లాలో 74,099 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 66,115 మంది ఉత్తీర్ణత సాధించగా, 7,984 మంది విఫలమయ్యారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!