

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో దాదాపు 20కిపైగా అజెండా అంశాలకు ఆమోదం లభించింది. మూడున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగాలు, మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపాలిటీల ఆస్తుల లీజ్ రీన్యువల్, అద్దె విధానాల సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో మ్యుటేషన్ ఛార్జీలను ఏకరీతిగా అమలు చేయడానికి చట్ట సవరణకు ఆమోదం తెలిపారు.
దిల్లీలోని ఏపీ భవన్లో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్టును సెక్షన్ ఆఫీసర్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి అంగీకరించారు. రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి రూ.354 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఏపీ మార్క్‌ఫెడ్‌కు రూ.1800 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ, అమరావతిలో పలు పనులకు రూ.1,208 కోట్ల మంజూరు చేశారు. అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతులు, హైకోర్టు మరియు జిల్లా కోర్టుల్లో 21 కొత్త పోస్టుల సృష్టికి ఆమోదం తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!