

ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో రూ.2,540 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. కృష్ణానది వరద రక్షణ పనులు, సచివాలయ భవనాల గ్లాస్ పనులకు కూడా ఆమోదం ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ పథకం నిబంధనల్లో మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే పోలవరం బాధితులకు ఇళ్ల నిర్మాణ ఖర్చును పెంచాలని నిర్ణయించారు.
అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ పనుల కోసం రూ.798 కోట్ల ప్రణాళికకు, ఉండవల్లి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.580 కోట్ల ప్రణాళికకు ఆమోదం తెలిపారు. 220 కేవీ కేబుల్స్ మార్పిడి పనులకు రూ.1,180 కోట్లు కేటాయించారు. ప్రకాశం జిల్లాలో పరిశ్రమల కేంద్రం కోసం భూమి కేటాయింపుకు కూడా ఆమోదం ఇచ్చారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124.5 కోట్లు మంజూరు చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!