
బిజినెస్

కే కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈసీ నిబంధనల ప్రకారం జనవరిలో ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, అందులో మూడో ప్రాధాన్యంగా ఇచ్చిన పేరును ఆమోదించారని తెలిపారు. ‘టీఆర్‌ఎస్’ పేరు తనకు ప్రత్యేకమని పేర్కొంటూ, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, పునరుజ్జీవం కోసం తన కృషిని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఇటీవల ప్రకటించిన రాజకీయ పార్టీకి ఈసీ ఆమోదం లభించగా, మొదట ప్రతిపాదించిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’కు బదులుగా ‘తెలంగాణ రక్షణ సేన’ పేరును ఖరారు చేసింది. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఈసీ అధికారులు ఆమోద లేఖ అందజేశారు. పార్టీ పేరుపై పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా తెలియజేయాలని ఈసీ సూచించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!