
జనరల్

మెప్మా మరియు నేటివ్ అరకు కాఫీ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఫ్రాంచైజ్ విధానంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అరకు కాఫీ దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మహిళలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా తెలిపారు.
ఈ ప్రణాళికలో భాగంగా వచ్చే రెండేళ్లలో ప్రతి జిల్లాలో రెండు అరకు కాఫీ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు అరకు కాఫీకి మరింత గుర్తింపు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!