

అక్రమ మార్గాల్లో పౌరసత్వం పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. పౌరసత్వం రద్దు ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 384 మందిని గుర్తించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. వీసాలపై కఠిన ఆంక్షలు విధించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తన దృష్టిని పౌరసత్వాల రద్దుపై కేంద్రీకరించింది. విదేశాల్లో జన్మించి అక్రమ పద్ధతుల్లో పౌరసత్వం పొందిన వారిపై చర్యలు వేగవంతం చేయాలని యోచిస్తోంది.
ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి వివిధ రాష్ట్రాల్లోని న్యాయవాదులకు కేసులు అప్పగించే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో న్యాయశాఖ అధికారులు ఇప్పటికే ప్రాంతీయ కార్యాలయాలతో సమావేశాలు నిర్వహించారు. అయితే, ఈ అంశంపై అమెరికా ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. పౌరసత్వం కోల్పోయే వారి వివరాలు ఇంకా వెల్లడ కాలేదు. చట్టాల ప్రకారం పుట్టుకతో పౌరసత్వం పొందిన వారికి ఈ చర్యలు వర్తించవని, అక్రమాలకు పాల్పడినవారిపైనే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!