
న్యూస్

భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, 2025లో యూపీఐ లావాదేవీల విలువ ₹22,830 కోట్లకు చేరింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025లో మొత్తం 228 బిలియన్ (22,800 కోట్లు) యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. ఇది 2024లో నమోదైన 172.2 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే భారీ పెరుగుదలగా నిలిచింది.
చిన్న వ్యాపారుల నుంచి పెద్ద సంస్థల వరకు యూపీఐ వినియోగం పెరగడం, స్మార్ట్ఫోన్ల విస్తరణ, డిజిటల్ చెల్లింపులపై నమ్మకం పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా ఎన్పీసీఐ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే 33 శాతం వృద్ధి నమోదు కావడం, భారత్ డిజిటల్ ఎకానమీ దిశగా వేగంగా అడుగులు వేస్తోందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!