

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఢిల్లీ మెట్రో ఫేజ్ 5(ఏ) విస్తరణకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుకు రూ.12,015 కోట్లు కేటాయించగా, 13 కొత్త స్టేషన్లను కలుపుతూ 16 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టనున్నారు. దీంతో రాబోయే మూడేళ్లలో ఢిల్లీ మెట్రో ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ 400 కిలోమీటర్ల స్థాయిని చేరనుంది.
ఫేజ్ 5(ఏ)లో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మూడు కొత్త కారిడార్లను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది ఢిల్లీ మెట్రో చరిత్రలో ఒక కీలక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 33,000 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని, మూడేళ్లలో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ మెట్రో ఆపరేషనల్ పొడవు 400 కిలోమీటర్లను దాటి, ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ రైల్ నెట్వర్క్లలో ఒకటిగా నిలుస్తుందని వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!