
క్రీడలు

రాజమండ్రి లాల చెరువు ప్రాంతంలో కల్తీ పాలు కలకలం రేపాయి. కల్తీ పాలు తాగి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అన్యూరియా, డయేరియా, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఆరుగురు ప్రస్తుతం రాజమండ్రి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో పలువురు చిన్నారులు కూడా అనారోగ్యానికి గురవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.
కల్తీ పాలు సరఫరా చేసినట్లు ఆరోపణలతో కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే రాజమండ్రి చౌడేశ్వరి నగర్‌కు చెందిన ఇద్దరు మృతి చెందగా, కనక రత్నం అనే మహిళ మరణాన్ని అధికారులు ధృవీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!