
గాసిప్స్

తిరుమలలో రాబోయే ముఖ్య పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను పలు రోజుల్లో నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈరోజు నుంచి 2026 జనవరి చివరి వరకు కొన్ని ప్రత్యేక తేదీల్లో ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.
డిసెంబర్ 23 న జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, డిసెంబర్ 29 వైకుంఠ ఏకాదశి ముందు రోజు, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలు, అలాగే జనవరి 25 న రథ సప్తమి సందర్భంగా ప్రోటోకాల్ వ్యక్తులు తప్ప అందరికీ వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలిపింది.
అంతేకాక, ఈ ప్రకటించిన తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలను స్వీకరించడం కూడా రద్దు చేసింది.
భక్తుల సందోహం పెరిగే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు ఈ నియమాలను గౌరవించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!