

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించిన ఘటనపై జరుగుతున్న సిట్ దర్యాప్తు వేగం పెరిగింది. ఇప్పటికే టీటీడీకి చెందిన పలువురు మాజీ, ప్రస్తుత అధికారులను విచారించిన విచారణ బృందం, ఇప్పుడు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పై దృష్టి సారించింది. విచారణలో బయటపడిన పలు అంశాల ఆధారంగా ఆయనను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
గురువారం, హైదరాబాద్లోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికే సిట్ బృందం వెళ్లి విచారించింది. ఉదయం నుంచి ప్రశ్నలు ప్రారంభించిన అధికారులు, భోజన విరామం తర్వాత మళ్లీ విచారణ కొనసాగించారు. సుబ్బారెడ్డితో పాటు ఆయన పీఏ చిన్నప్పన్న, మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరుల స్టేట్మెంట్లను ఇప్పటికే సిట్ సేకరించింది. ఆ వివరాలన్నీ ఇప్పుడు ఆయన ఎదుట ఉంచి సమాధానాలు కోరుతున్నట్లు సమాచారం.
విచారణలో అవసరమైన పలు కీలక పత్రాలను కూడా సిట్ బృందం హైదరాబాద్కు తీసుకువచ్చింది. గతంలో ఇతరాధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఉన్న వివరాలను పోల్చుతూ, ఆ ఆధారాలతో సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కొన్నింటిపై ఆయన మౌనం పాటించడంతో, నేరుగా పత్రాలను ముందుంచి వివరణ కోరే వ్యూహంతో సిట్ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
ఈ విధంగా శ్రీవారి లడ్డూ తయారీలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!