

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన ఎడమ చేతిపై గాయం కనిపించడంతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించిన సందర్భంగా ఆ గాయం స్పష్టంగా కనిపించడంతో, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. దీంతో అధ్యక్షుడి ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారంపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ, కార్యక్రమ సమయంలో బల్ల మూల తగలడంతో ట్రంప్ చేతికి స్వల్ప గాయం అయిందని తెలిపారు. దీనిపై ట్రంప్ కూడా వివరణ ఇచ్చారు. తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నానని, గాయానికి చికిత్స తీసుకున్నానని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు ఆస్ప్రిన్ కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గతంలోనూ ట్రంప్ చేతిపై ఇలాంటి గాయాలు కనిపించడంతో అనారోగ్య వార్తలు వచ్చినప్పటికీ, అప్పుడే వైట్‌హౌస్ వాటిని ఖండిస్తూ వృద్ధుల్లో సాధారణంగా కనిపించే రక్తనాళాల సమస్య కారణమని స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!