

ఆఫ్గనిస్తాన్ – పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో తన జోక్యం అవసరం లేదని భావిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరియు సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌లను ప్రశంసిస్తూ, వారిపై తనకు గౌరవం ఉందన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి స్థిరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్, కాందహార్ సహా పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, ఈ దాడుల్లో వందలాది మిలిటెంట్లు, తాలిబాన్లు మరణించినట్లు వెల్లడించింది. ఈ పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ కూడా స్పందిస్తూ, స్వీయ రక్షణ పాకిస్థాన్‌కు ఉన్న హక్కు అని తెలిపింది. మరోవైపు, తమ దేశంలో జరుగుతున్న దాడులకు అఫ్గానిస్థాన్ కారణమని పాకిస్థాన్ ఆరోపిస్తుండగా, అఫ్గానిస్థాన్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!