
సినిమాలు

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ అభిమానులకు ఒక స్పెషల్ మ్యాషప్ వీడియోతో సర్ప్రైజ్ ఇచ్చింది. బన్నీ సినీ ప్రయాణాన్ని చూపిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. “సినిమా స్థాయిని నిశ్శబ్దంగా పెంచుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి” అంటూ అల్లు అర్జున్ను ప్రశంసిస్తూ ఈ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో ఆయన మొదటి సినిమా నుంచి ‘పుష్ప: ది రైజ్’ వరకు చేసిన పాత్రలు, డ్యాన్స్ స్టెప్స్, మాస్ డైలాగ్స్‌ను చూపించారు. అలాగే ఆయన కష్టపడే స్వభావంపై సినీ ప్రముఖులు చెప్పిన మాటలను కూడా ఇందులో చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ ట్రెండ్‌తో వైరల్ అవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!