
న్యూస్

ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి రక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏడు దేశాలకు పిలుపునిచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయంగా చమురు రవాణాకు ప్రధాన మార్గంగా భావించే ఈ జలసంధి భద్రతపై ఇటీవల ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
జలసంధి భద్రతను బలోపేతం చేయడానికి ఆయా దేశాలు తమ యుద్ధ నౌకలను అక్కడికి పంపాలని ట్రంప్ కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య రవాణా మార్గాలను రక్షించడం, చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా చూడడం ఈ చర్యల లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ పరిణామం ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!