ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డ్రోన్ రక్షణ సహాయంపై వ్యాఖ్యలను ఖండించారు. కీవ్ నుంచి సహాయం అవసరం లేదని ట్రంప్ చెప్పిన విషయాన్ని ఆయన తిరస్కరించారు. గతంలో వాషింగ్టన్ తమను పలుమార్లు సంప్రదించిందని తెలిపారు. ఉక్రెయిన్ డ్రోన్ సాంకేతికతను అందించేందుకు గత ఏడాది అమెరికాకు 35 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ సహకార ఒప్పందాన్ని ప్రతిపాదించామని చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమెరికా సైనిక అధికారులు ఆసక్తి చూపారని, ట్రంప్ కూడా దీనికి అంగీకరించారని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ ఒప్పందంపై సంతకాలు ఎందుకు జరగలేదో తనకు తెలియదని, భవిష్యత్తులో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇక రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంలో త్రైపాక్షిక శాంతి చర్చలకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని జెలెన్స్కీ తెలిపారు. ఈ చర్చలు అమెరికాలో జరగాలని వాషింగ్టన్ సూచించిందని, అయితే మాస్కో ఇప్పటివరకు ప్రతినిధులను పంపేందుకు ముందుకు రాలేదని చెప్పారు. ఇదే సమయంలో మాస్కోపైకి ఉక్రెయిన్ ప్రయోగించిన 28 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. శనివారం జరిగిన మరో దాడిలో 47 డ్రోన్లను కూడా అడ్డుకున్నట్లు రష్యా అధికారులు తెలిపారు.



.jpg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!