
ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో ఉన్న ఎస్సీబీ వైద్య కళాశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాయ చికిత్స విభాగంలో చెలరేగిన మంటలు పెద్ద విషాదానికి దారి తీశాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 11 మంది గాయపడ్డారు. మంటలతో పాటు వ్యాపించిన దట్టమైన పొగ కారణంగా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిలో 23 మందికి అస్వస్థత కలిగింది.
ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై రోగులను రక్షించి ఇతర వార్డులకు తరలించారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!