ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో హాజరై సందడి చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. కథానాయికలుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రం ఉగాది సందర్భంగా ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సినిమా గబ్బర్ సింగ్ స్థాయి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన ప్రశంసించారు. కోవిడ్ పరిస్థితులు మరియు తన రాజకీయ బాధ్యతల మధ్య కూడా తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేశామని చెప్పారు. యాంకర్ సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక అభిమానుల ఉత్సాహంతో సందడిగా జరిగింది. చిత్ర బృందం ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని, మంచి విజయాన్ని అందుకుంటుందని నమ్మకం వ్యక్తం చేసింది.












.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!