అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కావడంతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన బీఆర్ఎస్ పార్టీ తన పాత్రను సరిగా నిర్వర్తించలేకపోయిందని, ప్రస్తుతం బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
అసెంబ్లీలో రైతుల సమస్యలు, రైతు భరోసా అమలులో ఉన్న లోపాలు, అలాగే ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్లో సబర్మతి నది అభివృద్ధికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారని, కానీ తెలంగాణలో మూసీ పునరుద్ధరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్నారని ఆయన ఆరోపించారు.
అదే సమయంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదని, డ్రగ్స్ విస్తృతంగా అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. శాసనసభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటంలో బీఆర్ఎస్ వెనుకబడి ఉందని, బీజేపీ మాత్రం ప్రజల సమస్యల కోసం గట్టిగా పోరాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!