
బిజినెస్

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గిరిశిఖర ఓటకకోసు గ్రామం మైదాన ప్రాంతానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం గిరిజనుల జీవితాలను కష్టతరంగా మారుస్తోంది. గ్రామానికి చేరుకోవాలంటే అటవీ మార్గాల మీదే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇటీవల కాలువాపుతో బాధపడుతున్న వాటక నిమ్మలమ్మ అనే 16 ఏళ్ల గిరిజన బాలిక నడవలేని స్థితికి చేరుకుంది. మంగళవారం ఆమె తండ్రి వాటక నరసయ్య, ఇతర బంధువుల సహాయంతో డోలీ ద్వారా బాలికను మైదాన ప్రాంతమైన బట్టిమూగవలస వరకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని బంధువులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!