
.jpeg&w=3840&q=75)
కడప లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత యువకుడు తనపై ఇష్టం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రెహానా (26) ఎమ్మెస్సీ పూర్తి చేసి ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా పట్టా పొందింది. ఆమెకు ప్రొద్దుటూరు కు చెందిన, ప్రస్తుతం Bengaluru లో పనిచేస్తున్న షాజహాన్తో ఫిబ్రవరి 15న నిశ్చితార్థం జరిగింది.
నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా, ఇటీవల యువకుడు తనకు ఇష్టం లేదని, ఫీలింగ్స్ లేవని చెప్పడం ప్రారంభించాడు. మొదట సరదాగా తీసుకున్న యువతి, అతడు పదేపదే అదే మాట చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. సోమవారం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలంలో 12 పేజీల సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!