
న్యూస్

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె సమస్యలకు పరిష్కారం కాదని, ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని తెలిపారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం ఎలాంటి వ్యతిరేకత లేదని, వాటిని త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు.
ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు వంటి అంశాలు సాంకేతికంగా పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. బకాయిల చెల్లింపులు, నియామకాలు వంటి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రోజూ లక్షలాది మంది ప్రయాణించే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, మహిళలు ఇబ్బంది పడకూడదని కార్మికులను కోరారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!