

నటుడు ధనుష్, మమితా బైజు జంటగా మిడిల్ క్లాస్ భార్యాభర్తలుగా కనిపించనున్న చిత్రం ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ సినిమాకి ‘పోర్ తొజిల్’ ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద ఈ నెల 30, 2026న తెలుగులో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ధనుష్, మమితా బైజు భార్యాభర్తలుగా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. 1991 గల్ఫ్ వార్ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర నిర్వహణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించగా, విఘ్నేశ్ రాజా, ఆల్ఫ్రెడ్ ప్రకాష్ కథ రచించారు. థేనీ ఈశ్వర్ కెమెరా, శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ చేశారు. త్వరలోనే ప్రమోషన్స్తో మేకర్స్ సందడి చేయనున్నారు. సూరజ్ వెంజరమూడు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!