
క్రీడలు

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం పరిసర ప్రాంతాల్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులు ప్రారంభమవడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో పిల్లర్ నిర్మాణ పనులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.
ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ ప్రధాన ద్వారం, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మధ్య రద్దీ పెరిగే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సాగర్ సొసైటీ వద్ద వాహనాలను మళ్లించే ఏర్పాట్లు చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు. పనులు పూర్తయ్యే వరకు కొంత అసౌకర్యం ఉండొచ్చని తెలిపారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!