

ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ ఆధ్వర్యంలో లోక్ భవన్లో సాయంత్రం 6 గంటలకు “ఎట్ హోమ్” కార్యక్రమం నిర్వహించనుండగా, పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమం కారణంగా మోనప్ప ఐలాండ్ నుంచి ఖైరతాబాద్ వీవీ విగ్రహ జంక్షన్ వరకు ఉన్న లోక్ భవన్ రోడ్డుపై మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ మార్గాన్ని తప్పించుకొని ప్రత్యామ్నాయ రహదారులు వినియోగించాలని వాహనదారులకు సూచించారు. ప్రజలు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని, అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని కోరారు. అత్యవసర అవసరాల కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!