
మేషం
మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో పెండింగ్ పనులు సమయానికి పూర్తిచేయాలి. ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. సూర్య ధ్యానం శుభం.
వృషభం
చేపట్టిన పనుల్లో కొంత ఆటంకం ఎదురైనా, వాటిని దాటుకునే సామర్థ్యం ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెడతారు. మనోస్థితి మారవచ్చు, శాంతంగా ఉండటం అవసరం. దుర్గా శ్లోక పఠనం మేలు చేస్తుంది.
మిథునం
ఉత్సాహంతో పనులు ముందుకు సాగిస్తారు. ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తారు. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ముఖ్య విషయాల్లో బంధువుల సహకారం మంచిది. ఇష్టదేవతా ప్రార్థన శుభం.
కర్కాటకం
చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సహాయం లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. వేంకటేశ్వర స్వామి దర్శనం శక్తినిస్తుంది.
సింహం
శారీరక శ్రమ పెరిగే సూచనలు ఉన్నాయి. బంధువులతో వాదనలు నివారించాలి. అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది. శని ధ్యానం మేలు చేస్తుంది.
కన్య
పనుల్లో ఒత్తిడి పెరిగినా, కుటుంబ సలహాలు ఉపయుక్తంగా ఉంటాయి. శారీరక అలసట ఉండవచ్చు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు రావచ్చు. దుర్గా శ్లోకం చదవడం మంచిది.
తుల
మంచి భవిష్యత్తుకు సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వృత్తి రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త ధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన శుభం.
వృశ్చికం
చేపట్టిన పనుల్లో ఆలస్యాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహం కలిగించవచ్చు. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. నవగ్రహ శ్లోకం పఠించడం మేలు.
ధనుస్సు
పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో సహకారంతో పనులు వేగంగా పూర్తవుతాయి. మానసిక స్థైర్యం బలంగా ఉంటుంది. సూర్య శ్లోకం శుభప్రదం.
మకరం
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త అవసరం. ఓర్పు, మనోబలం కీలకం. అనవసర భయాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ ధ్యానం మేలు.
కుంభం
అనుకూల ఫలితాలు లభిస్తాయి. విందు వినోదాలు, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది.
మీనం
మంచి పనులు చేస్తారు. ఉద్యోగ, వృత్తి రంగాల్లో అనుకూలత ఉంటుంది. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కీలక నిర్ణయాల్లో వెనకడుగు వేయవద్దు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయం లభిస్తుంది. గోవింద నామస్మరణ శుభం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!