
ఆరోగ్యం

వందే భారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ రైల్వే జీఎంకు వచ్చిన లేఖ కలకలం రేపింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న నలుగురు జిహాదీ సభ్యులు ఈ కుట్రకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వందే భారత్ రైళ్లు ప్రయాణించే రైల్వే మార్గాల్లో బాంబులు అమర్చి సుమారు 250 మందిని హతమార్చేందుకు పథకం వేసినట్లు ఆగంతకుడు లేఖలో ఆరోపించాడు. ఈ లేఖ ఈ నెల 3వ తేదీన పోస్టు ద్వారా రైల్వే జనరల్ మేనేజర్‌కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా సంస్థలకు సమాచారం అందించి, రైల్వే మార్గాలు, స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. వందే భారత్ రైళ్లకు అదనపు భద్రత ఏర్పాటు చేస్తూ, లేఖ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికులు ఆందోళన చెందవద్దని, భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!