
గాసిప్స్

ఉన్నావ్ అత్యాచారం కేసు నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగార్ కుమార్తె ఇషితా సెంగార్ రాసిన లేఖ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తన తండ్రిపై ఉన్న నేరారోపణల కారణంగా తమ కుటుంబాన్ని సమాజం చూస్తున్న తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రపంచం తనను ఒక వ్యక్తిగా కాకుండా కేవలం “రేపిస్ట్ కూతురు”గా మాత్రమే ముద్ర వేసిందని, ఇది తనను మానసికంగా తీవ్రంగా కుంగదీస్తోందని లేఖలో పేర్కొంది.
చట్టం తన పని తాను చేస్తుందన్న నమ్మకంతో తమ కుటుంబం ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉందని ఆమె తెలిపింది. అయితే ఆ నిశ్శబ్దాన్ని సమాజం ఓటమిగా భావిస్తోందని, అదే తనకు మరింత బాధ కలిగిస్తోందని ఇషితా సెంగార్ తన లేఖలో వెల్లడించింది.





.jpeg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!