
న్యూస్

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూమి కంపించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సుమారు 10 అడుగుల ఎత్తు వరకు సముద్ర అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
జపాన్ ఉత్తర భాగంలోని సాన్‌రికు తీరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇది భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.













.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!