
గాసిప్స్

తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర నేటితో ముగియనుంది. కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన అనంతరం సమ్మక్క, సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 28న ప్రారంభమైన జాతరకు నిన్నటి వరకు దాదాపు 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల భారీ రాకతో మేడారం ప్రాంతం భక్తిశ్రద్ధలతో మార్మోగింది. ఇక ఈ మహాజాతర మళ్లీ రెండేళ్ల తర్వాత జరగనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!