
సినిమాలు

టాలీవుడ్‌లో ప్రభాస్ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌పై గత కొంతకాలంగా భారీగా చర్చ జరుగుతోంది. ‘హనుమాన్’ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘సలార్ 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఆయన షెడ్యూల్‌ను పూర్తిగా ఆక్రమించాయి. మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా తన సూపర్ హీరో యూనివర్స్ విస్తరణలో బిజీగా ఉన్నారు. ఇద్దరి డేట్స్ కలవకపోవడంతో ఈ భారీ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం తక్కువగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!