

స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ యాప్‌ను తప్పనిసరిగా ముందస్తు ఇన్స్టాలేషన్ (ప్రీఇన్‌స్టాల్) చేయాలన్న ఆదేశాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి మొబైల్ ఫోన్ తయారీ సంస్థలకు జారీ చేసిన ఆదేశాలను ఉప సంహరించుకుంటున్నట్టు టెలికం శాఖ (డీఓటీ) బుధవారం ప్రకటించింది. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
బుధవారం సాయంత్రం టెలికం శాఖ దీనిపై ప్రకటన విడుదల చేసింది. ‘‘పెద్దగా అవగాహన లేని ప్రజలకు కూడా ఈ యాప్‌ను చేరువ చేయాలన్న ఉద్దేశంతోనే తప్పనిసరిగా ప్రీఇన్‌స్టాల్ చేయాలన్న ఆదేశాలు జారీ చేశాం. మంగళవారం ఒక్కరోజే 6 లక్షల మంది సంచార్ సాథీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది పదింతలు ఎక్కువ. డౌన్లోడ్లు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కోటిన్నర మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
ప్రజల్లో మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో.. తప్పనిసరిగా ప్రీఇన్‌స్టాల్ చేయాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని టెలికం శాఖ తెలిపింది.








.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!