
న్యూస్

రైతులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రేపటి నుంచి (శుక్రవారం) జిల్లాల వారీగా రైతులకు భూమి పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. ఆయా మండలాల వారీగా ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. ఈ పాస్ పుస్తకాల పంపిణీ ద్వారా భూ హక్కులపై రైతులకు స్పష్టత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
పాస్ పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే అధికారులే రైతుల ఇంటికి వెళ్లి సరిచేస్తారని మంత్రి స్పష్టం చేశారు. భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్లను అన్ని జిల్లాల్లో విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది భూమి నామ సంవత్సరంగా ఉంటుందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!