
.jpeg&w=3840&q=75)
టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు తన పేరుతో హాస్పిటల్ ను ఓపెన్ చేసారు. ఈ హాస్పిటల్ ను స్వయంగా సెరెనా ఓపెన్ చేశారు. 44 ఏళ్ల సెరెనా తన $500 మిలియన్ సంపద మొత్తాన్ని లాస్ ఏంజెల్స్‌లోని స్కిడ్ రో ప్రాంతంలో నిరాశ్రయులు, బీమా లేని వారి కోసం పూర్తిగా ఉచితంగా సేవలు అందించే 1,200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఆమె ఆస్తులు, పెట్టుబడులు, ఆభరణాలు, గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు కూడా ఈ ప్రాజెక్ట్‌కు వినియోగించరని ఆ దేశ మీడియా లో వార్తలు వచ్చాయి.
అలాగే, నిర్మాణ స్థలంలోనే 100 రోజులకుపైగా నివసిస్తూ, గర్భవతిగా ఉన్నప్పటికీ కార్మికులతో కలిసి పని చేస్తున్నారని ఆ వార్తల్లో వెల్లడి అయింది. చివరి వైద్య పరికరాల కొనుగోలుకు ఫ్లోరిడాలోని తన భారీ నివాసాన్ని విక్రయించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా సెరెనా హాస్పిటల్ ఏర్పాటు పై ప్రపంచ వ్యాప్తంగా ఆమెను అభినందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!