

ఈ ఏడాది మావోయిస్టుల లొంగుబాట్లలో తెలంగాణ దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 509 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న మావోయిస్టుల్లో తెలంగాణకు చెందిన వారు 54 మంది ఉండగా, అధికారికంగా పోలీసుల రికార్డుల్లో ఉన్నది 21 మంది మాత్రమే. వీరిలో కేంద్ర కమిటీకి చెందిన 5 మంది, రాష్ట్ర కమిటీకి చెందిన 8 మంది, ఇతర హోదాల్లో ఉన్న మరో 8 మంది ఉన్నారు. వీరంతా లొంగిపోతే తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆపరేషన్ కగార్ లక్ష్యానికి ముందుగానే మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ప్రకటన చేయగా, అదే బాటలో తెలంగాణ కూడా అడుగులు వేస్తోంది. మిగిలిన మావోయిస్టుల లొంగుబాట్ల కోసం రాష్ట్రంలో ప్రయత్నాలు ముమ్మరం చేయగా, ఇప్పటికే లొంగిపోవడానికి పలువురు మావోయిస్టులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!