

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 136 కౌంటింగ్ కేంద్రాల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టగా, అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం ప్రక్రియను సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహిస్తూ, సుమారు 20 వేల మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి సుమారు రెండు గంటలు పట్టే అవకాశం ఉండగా, సాయంత్రానికి పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది.
116 మున్సిపాలిటీలలోని 2,569 వార్డుల నుంచి 10,179 మంది అభ్యర్థులు పోటీ పడగా, ఏడు కార్పొరేషన్లలోని 412 డివిజన్లకు 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫలితాల అనంతరం ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అలాగే కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!