

తెలంగాణ జాగృతి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికలతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా సింహం గుర్తుతో బరిలోకి దిగేందుకు జాగృతి నాయకత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీతో చర్చలు పూర్తి చేసిన తెలంగాణ జాగృతి, ఆ పార్టీకి చెందిన సింహం గుర్తును వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సమావేశాల్లో ఏఐఎఫ్బీ, తెలంగాణ జాగృతి మధ్య ఈ అంశంపై సయోధ్య కుదిరినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే పార్టీ అధికారికంగా రిజిస్టర్ కావడానికి ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్, జిల్లా మరియు మండల పరిషత్ ఎన్నికల్లో సింహం గుర్తుతోనే పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!