

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (tgpsc) గ్రూప్-3 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తుండగా, తాజాగా కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. మొత్తం 1370 మంది అభ్యర్థులు ఈ గ్రూప్-3 నియామకాల్లో ఎంపికైనట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది.
కమిషన్ విడుదల చేసిన జాబితాలో జనరల్ ర్యాంక్ లిస్ట్ (GRL) రూపంలో అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులనే ఈ ప్రొవిజనల్ ఎంపిక జాబితాలో చేర్చారు. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.
గ్రూప్-3 ఫలితాల విడుదలతో తదుపరి దశలైన వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, పోస్టింగ్ ప్రక్రియపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నియామక ప్రక్రియ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉందని, తదుపరి షెడ్యూల్ను కమిషన్ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించనున్నట్లు సమాచారం.






.png&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!