

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రకటించిన ఆరోగ్య మరియు ప్రమాద బీమా పథకాలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపు మరియు రూ.1,056 కోట్ల మూలనిధితో ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం పెద్ద సంఖ్యలో సంఘాల ప్రతినిధులు సీఎం నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్స అందించే ఈ పథకం ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ఉపయోగకరమని, ఇది చరిత్రాత్మక నిర్ణయమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో పదోన్నతుల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తహసీల్దార్ల సమస్యలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొనసాగింపు, వేతన సవరణలు వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరణించిన వీఆర్ఏల కుటుంబాలకు కారుణ్య నియామకాలు, వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ విభాగంలోని కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రశంసించాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!