

హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్లే 12604 సూపర్‌ఫాస్ట్ రైలుకు మంగళవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిట్రగుంట స్టేషన్ వద్ద ఉదయం 2.58 గంటల సమయంలో డేంజర్ సిగ్నల్ ఉన్నప్పటికీ రైలు ఆగకుండా ముందుకు వెళ్లింది. అయితే సుమారు అర కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాత రైలు నిలిచింది. అదే వేగంతో ముందుకు సాగి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే స్టేషన్ నుంచి సంఘటన స్థలానికి చేరుకుని లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లను రైలు నుంచి దింపేశారు. అనంతరం ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించి రైలును కొనసాగించేందుకు అనుమతిచ్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు డివిజన్ స్థాయి అధికారులు, వైద్యాధికారులు సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!