
గాసిప్స్

ముంబై: దివంగత ఎన్సీపీ నేత అజిత్ పవార్ సతీమణి, రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్‌ను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. శనివారం లెజిస్లేటివ్ బిల్డింగ్‌లో జరిగిన ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె పేరును ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ప్రతిపాదించగా, మంత్రి ఛగన్ భుజ్బుల్ బలపరిచారు.
అనంతరం ఎలాంటి వ్యతిరేకత లేకుండా సునేత్ర పవార్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపికయ్యారు. అజిత్ పవార్ స్థానంలో ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్నారు.
సునేత్ర పవార్ శనివారం సాయంత్రం 5 గంటలకు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో మహారాష్ట్ర చరిత్రలో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!