
.jpg&w=3840&q=75)
డిసెంబర్ 15 నుంచి, అమెరికా ప్రభుత్వం వీసా రూల్స్‌లో కొన్ని మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఆన్లైన్ ప్రెజెన్స్ చెక్ అంటే సోషల్ మీడియా అకౌంట్స్‌ను పరిశీలించడం ఇది స్టూడెంట్స్, ఎక్స్చేంజ్ విజిటర్ వీసాలకే వర్తించేది. కానీ డిసెంబర్ 15 నుంచి అన్ని H-1B అప్లికెంట్లు మరియు వాళ్ల డిపెండెంట్స్ (H-4) కూడా ఈ చెక్కు రావాలి. ఈ ప్రక్రియలో భాగంగా, H-1B, H-4, F, M, J వీసాలకు అప్లై చేస్తున్నవారు అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌ను పబ్లిక్‌గా మార్చాలి. ఇలా చేస్తే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం వారికి సులభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ చెబుతోంది.
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ మాటల్లో వీసా అప్లికేషన్ స్క్రీనింగ్‌లో లభ్యమయ్యే అన్ని వివరాలను వారు పరిశీలిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ద్వారా అమెరికాకు హాని కలిగించే అవకాశం ఉన్నవాళ్లను, నేషనల్ సెక్యూరిటీకి రిస్క్ అయే వారిని గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు స్టూడెంట్స్, ఎక్స్చేంజ్ విజిటర్స్‌కి ఆన్లైన్ చెకింగ్ తప్పనిసరి కాగా, ఇప్పుడు ఈ రూల్ H-1B వీసాదారులకు కూడా వర్తిస్తుంది. ప్రతి వీసా నిర్ణయం అమెరికా దృష్టిలో నేషనల్ సెక్యూరిటీ విషయం అని వారు చెబుతున్నారు. దేశంలోకి వచ్చే వాళ్లు అమెరికన్ ప్రజలకు హాని చేసే ఉద్దేశంతో లేరని, వీసా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారనే నమ్మకం కలగాలి. చివరగా అమెరికా వీసా ఒక హక్కు కాదు, అది ఒక ప్రత్యేక అవకాశం మాత్రమే అని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!