

ఆంధ్రప్రదేశ్లోని వివిధ బ్యాంకుల్లో రూ.2,279.16 కోట్ల మేర అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వివరాలను లోక్సభ లో సోమవారం వెల్లడించింది. జీఎం హరీష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ, గత నెల 28 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఈ మొత్తంలో నిధులు క్లెయిమ్ కాకుండా మిగిలిపోయాయని తెలిపారు.
ఈ సొమ్ము అసలైన ఖాతాదారులకు లేదా వారి వారసులకు చేరేలా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు.
మీ సొమ్ము–మీ హక్కు అనే అవగాహనా కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 158 ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరాల ద్వారా 34,455 ఖాతాలకు సంబంధించిన రూ.161.69 కోట్లను విజయవంతంగా సెటిల్ చేసినట్లు చెప్పారు.
అలాగే కోనసీమ జిల్లా లో 1,899 ఖాతాలకు చెందిన రూ.5.08 కోట్లను ఖాతాదారుల వారసులకు అందజేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!