

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తన సరికొత్త అల్ట్రా మోడ్రన్ మేకోవర్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. అక్కినేని యువ సామ్రాట్ తన 24వ చిత్రం ‘వృషకర్మ’ను భారీ స్థాయిలో, గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిస్టికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య నిధి అన్వేషకుడి పాత్రలో సరికొత్త యాటిట్యూడ్‌తో కనిపించనున్నారు. ఇదే సమయంలో, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ఈ మైలురాయి చిత్రం కోసం చైతన్య తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ముల్లెట్ హెయిర్ స్టైల్‌తో పాటు స్టైల్‌గా సెట్ చేసిన గడ్డం ఆయనకు రగ్గడ్ లుక్‌ను అందించింది. సాధారణంగా క్లాస్ పాత్రలతో కనిపించే చైతన్య, ఈసారి పూర్తిగా మాకో మ్యాన్ అవతారంలో దర్శనమిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఫ్యాషన్ ప్రపంచంలోని తాజా ట్రెండ్‌ను ప్రతిబింబించే ఈ లుక్, ఆయన 25వ చిత్రంలో పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో సూచిస్తోంది.
సోఫాపై కూర్చున్న స్వాగ్, కళ్లలో కనిపిస్తున్న ఇంటెన్సిటీ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతున్నాయి. సాఫ్ట్ ఇమేజ్ నుంచి మాస్ లుక్‌కు మారడం ఆయన కెరీర్‌లో ఒక కీలక మలుపుగా నిలవనుంది. వైవిధ్యమైన ప్రయోగాలతో బాక్సాఫీస్ వద్ద కొత్త మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు నాగచైతన్య సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ‘వృషకర్మ’ చిత్రం దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు ఉండగా, ఆయన 25వ సినిమా దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!