
న్యూస్
.webp&w=3840&q=75)
దర్శకుడు అనిల్ రావిపూడి లైనప్‌లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై చర్చ జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ భారతీయ ఇతిహాసం రామాయణంను యానిమేటెడ్ రూపంలో తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉండగా, విజువల్‌గా ఆకట్టుకునేలా రూపొందించేందుకు ప్లాన్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్‌కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. 2024 లో విడుదలైన మహావతార్ నరసింహా విజయంతో మైథాలజికల్ యానిమేషన్ చిత్రాలకు మంచి ఆదరణ లభించడంతో ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ఆధునిక సాంకేతికతతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!