

చిరయ్యా సిరీస్ వ్యక్తిగత స్వేచ్ఛ మరియు పరస్పర గౌరవం గురించి బలమైన సందేశాన్ని అందిస్తుంది. ప్రపంచంలో స్వేచ్ఛకు సరిహద్దులు లేకపోయినా, వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రం హద్దులు ఉంటాయని ఈ కథ స్పష్టంగా చెబుతుంది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి అయినా ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు గౌరవించాలి అనే భావాన్ని ఈ సిరీస్ అందంగా చూపించింది. ఆరు భాగాలతో రూపొందిన ఈ కథ సున్నితమైన అంశాన్ని సులభంగా అర్థమయ్యేలా చూపిస్తుంది.
ఈ కథలో పూజ అనే యువతి పెద్దలు కుదిర్చిన పెళ్లితో అరుణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అతని ఇంటికి వెళుతుంది. అత్తమామలు మరియు కుటుంబ సభ్యులు ఆమెను ప్రేమగా చూసుకుంటారు. కానీ అరుణ్‌తో ఆమెకు ఒక సమస్య ఎదురవుతుంది. ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేకపోతుంది. చివరకు ఆమె వదిన దివ్యకు ఈ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత దివ్య ఎలా స్పందించి పూజకు సహాయం చేస్తుందో కథలో చూపించారు.
ఈ సిరీస్‌లోని అంశం చాలా సున్నితమైనదైనా, ఎక్కడా అసభ్యంగా చూపించకుండా హుందాగా తెరకెక్కించారు. ముఖ్యంగా పెళ్లైన మగవారు తమ భాగస్వామిని గౌరవించాలి అనే మంచి సందేశాన్ని ఇస్తుంది. చివర్లో వచ్చే పరిష్కారం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పెద్దలు మాత్రమే చూడదగ్గ ఈ సిరీస్ వీకెండ్లో చూడటానికి మంచి ఎంపిక.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!