
గాసిప్స్

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవ అయిన స్టార్‌లింక్ ఇప్పుడు భారత మార్కెట్లో కమర్షియల్‌గా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు అధిక వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించాలన్న లక్ష్యంతో సంస్థ ఇప్పటికే తన నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్యాకేజీల వివరాలను విడుదల చేసింది.
స్టార్‌లింక్ ఇండియా వెబ్సైట్ ప్రకారం, రెసిడెన్షియల్ కస్టమర్లకు ఈ సేవలను పొందాలంటే నెలకు ₹8,600 చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా, సేవలను ఉపయోగించేందుకు అవసరమైన హార్డ్‌వేర్ కోసం ₹34,000 ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అపరిమిత డేటా లభించాలని సంస్థ స్పష్టం చేసింది. అంతేకాదు, కొత్త యూజర్ల కోసం 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది.




















కామెంట్స్ (1)
Exciting launch for India!