

సౌదీ అరేబియాలోని వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఎడారి దేశంలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, ఇసుకతో కప్పబడిన భూభాగమే కనిపించే పరిస్థితులు ఉంటాయి. అయితే, గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అక్కడ వాతావరణంలో అసాధారణమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురవడం ప్రత్యేకత అయితే, ఇప్పుడు విపరీతమైన మంచు పడడం, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీలకు చేరడం స్థానికుల్ని ఆశ్చర్యంలో పడేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 4 డిగ్రీలు నమోదవుతున్నాయి.
తబుక్ ప్రావిన్స్‌లోని పర్వతాలు విస్తారంగా మంచుతో కప్పబడి ఉన్నాయి. 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రొజెనా ప్రాంతంలో మంచుతో పాటు వర్షం కూడా కురుస్తోంది. హెయిల్ ప్రాంతంలో చలిగాలుల ప్రభావంతో భారీ వర్షాలు పడినట్లు సమాచారం. ఈ విపరీత వాతావరణ పరిస్థితుల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సౌదీ వాతావరణ కేంద్రం ఈ పరిస్థితులపై స్పందిస్తూ, చల్లని గాలులు మేఘాలను తాకి వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వివరించింది. భారీ వర్షాల కారణంగా వరద ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు జారీ చేసింది. కొన్ని ప్రావిన్స్‌లలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు వెలువడినట్లు తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!