

అమరావతిలో భూసమీకరణ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం రెండో విడత నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈసారి ప్రభుత్వ భూములు కాకుండా మొత్తం 16,666 ఎకరాల భూములను సమీకరించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్ వెలువడటంతో రాజధాని నిర్మాణ పనులు మరింత వేగం అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో కొంత భూ సమీకరణ పూర్తయ్యింది. ఇప్పుడు రెండో విడతలో కూడా రైతులతో చర్చలు, భూ ఇచ్చే విధానాలు, పరిహారాలు వంటి అంశాలు ముఖ్యంగా చర్చనీయాంశాలుగా మారాయి.
ఈ భూసమీకరణ బాధ్యతను CRDA కమిషనర్‌కు అధికారికంగా అప్పగించారు. అమరావతి మండలంలో ఉన్న నాలుగు గ్రామాలు, అలాగే తుళ్లూరు మండలంలో ఉన్న మూడు గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించారు. సంబంధిత గ్రామాల్లో భూయజమానులకు నోటీసులు ఇవ్వడం, వారి అభిప్రాయాలు సేకరించడం, ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన లాభాలు–నిబంధనలు వివరించడం వంటి ప్రక్రియలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ చర్యలతో అమరావతి అభివృద్ధి మరోసారి హైలైట్ అవుతూ, రాజధాని ప్రాజెక్ట్ మళ్లీ వేగం అందుకున్నట్టుగా భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!