

వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాది మంది సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా జనవరి 2 నుంచి సర్వదర్శనం (టోకెన్ లేని దర్శనం)కు మళ్లీ అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో రద్దీ భారీగా పెరిగింది. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా భారీగా తరలివచ్చి కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. టీటీడీ అధికారుల అంచనాలకు మించి భక్తులు చేరుకోవడంతో ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ల నుంచి భక్తులను క్రమబద్ధంగా లోపలి క్యూ లైన్లకు అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ఆహారం, భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశామని అధికారులు తెలిపారు.
క్యూ లైన్లలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ భక్తుల కదలికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనం, సర్వదర్శనం ప్రారంభం కారణంగా రాబోయే కొన్ని రోజుల్లో తిరుమలలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు సహనం పాటించాలని, టీటీడీ అధికారుల సూచనలను పాటించి సహకరించాలని కోరారు. భక్తుల భారీ సంఖ్యలో తరలివచ్చిన కారణంగా శ్రీవారి దర్శనానికి కొంత ఆలస్యం జరుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!